శేషేంద్ర శర్మ రచనల గ్రంథ హక్కుల కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పు ( 25 జవరి 2024 ) సాత్యకి వివరణ
శేషేంద్ర శర్మ రచనల గ్రంథ హక్కుల కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పు ( 25 జవరి 2024 ) సాత్యకి వివరణ
------------------
శేషేంద్ర : సాహిత్య చరిత్ర లో
ఒక భయానక విషాద గాథ
&
శేషేంద్ర శర్మ కాపీరైట్స్ /
ముఖాముఖి / ప్రశ్నలు జవ్వాబులు
1. గుంటూరు శేషేంద్రశర్మ వారసులుగా మీ అనుభూతి?
జ. నాకు ఆయన నాన్న , కన్న తండ్రి. అదే వారసత్వం , కానీ సాహిత్యం గురించి
మాట్లాడుకునేప్పుడు వారసత్వం , అర్థం , లక్ష్యం , పరమార్థం దీనికి పూర్తిగా భిన్నమైనది . సాహిత్యం ద్వారా ఆయన మీద ఆదరాభిమానాలు ఉన్నవారు, ఆయనకు తగిన గుర్తిపు గౌరవ పురస్కారాలు దక్కలేదని మనస్తాపం చెందేవారు , ఆయన పాఠకులూ అందరూ ఆయన వారసులే , ఆయన సాహిత్య ఆదర్శాలను ముందుకాలాలకు చేర్చేవారు ఎవరో ? వాళ్ళని ఆయన వారసులుగా కాలం గుర్తిస్తుంది .
2. శేషేంద్ర గారికి ఎంతమంది సంతానం? వారెక్కడున్నారు? ఏం చేస్తున్నారు?
4 పిల్లలం , వారివారి జీవితాల్లో నిమగ్నులైవున్నారు
3. మీది గతంలో కాశ్మీరీ పండితుల వంశమని విన్నాను. నిజమేనా?
నాన్న కన్ను మూసిన క్షణం నుంచి ఆయన నేపథ్యాన్ని రూపుమాపే నేరపూరిత కుట్ర ఇది . ఒక రజాకార్ పుంశ్చలిక , ఆస్థాన జాగిలాలు , కిరాయి జాగిలాలు , ఒక పథకం ప్రకారం ఈ నేరానికి , ఈనాటికీ పాల్పడుతున్నారు . నూటికి నూరు పాళ్ళు తెలుగు కుటుంబం , ఆంద్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా , తోటపల్లిగూడూరు స్వగ్రామం , ఆయన తల్లిదండ్రుల నివాసం . మీకూ తెలుసు గదా .
4. నెల్లూరు జిల్లా, తోటపల్లి గూడూరుతో మీ అనుబంధం?
జ. మాటల్లో చెప్పనలవి కానిది . తోటపల్లి గూడూరు అనగానే నాన్న , తాత అవ్వ అందరూక ళ్ళ ముందు ప్రత్యక్ష మవుతారు . వాళ్ళతో పెనవేసుకోవున్న స్మృతులన్నీ ఆల్బమ్ గా , మనసులో పుటలు పుటలుగా విఛ్చుకుంటాయి .
5. నాన్న గారు గ్యాన్బాగ్ ప్యాలస్కు ఎప్పుడు మారారు? ఆ సంఘటనపై మీరేం చెప్పదల్చుకున్నారు?
జ. . ఆయన జీవితంలో అత్యంత భయానకమయిన ప్రమాదం ఇది . ఇక అక్కడ అడుగు పెట్టినప్పట్నుంచి చివరి క్షణం వరకూ మానసికంగా , భౌతికంగా నరక యాతనకు గురయ్యాడు . అక్కడ ఉండలేక , ఆ నరక కూపం నుంచి , ఊబిలోంచి బయట పడలేక చెప్పనలవిగాని చిత్రవధకు గురయ్యాడు . వారానికొక సారి ఆ మనిషిని చావగొట్టి పారిపోయివచ్చ్చేవాడు . ఇక తన వద్దకు రావద్దని ఫోన్ లో అరిచేవాడు . ఆ మనిషి మినిస్టర్లతో , పెద్దవాళ్ళతో నాన్న మీద ఒత్తిడి తెచ్చ్చేది . మళ్ళీ అక్కడికి వెళ్ళేవాడు . 1997 వరకూ ఇదే గొడవ . ఆ మనిషితో ఉన్నదీ లేదు , తెగతెంపులు అయ్యిందీ లేదు . చెప్పనలవిగాని మానసిక , శారీరక క్షోభ . తెలుగు కవుల జీవితాల్లో ఇది ఒక నేర గాథ తప్ప మరొకటి కాదు . ఆయన కవిత చదవండి .
6. హైదరాబాదుకు మారాకే శేషేంద్ర గారికి విశ్వవిఖ్యాత గుర్తింపు వచ్చింది అనడం వాస్తవం కాదా?
జ. ఇది వాస్తవం కాదు . కవిగా , పండితుడిగా 1967 నాటికే సాహిత్య వర్గాల్లో గౌరవనీయుడయిన ప్రముఖుడిగా స్థిరపడ్డాడు . ఇక సమాజం లో గానీ జన బాహుళ్యంలో గానీ కీర్తి కోసం ప్రచారం కోసం ఆయన తాపత్రయ పడలేదు , ప్రయత్నించలేదు .
7. శేషేంద్ర రచనా వారసత్వం ఎవరు పుచ్చుకున్నారు?
జ. ఆయన మీద అపారమైన ఆదరాభిమానాలతో , ఆయన నెలకొల్పిన శైలి లో కవిత్వం రాసేవాళ్ళందరూ ఆయన వారసులు అని చెప్పుకోవాలి . ఆయన మీద ఆదరాభిమానాలున్న వారందరూ ఆయన వారసులే .
8. వారి రచనలపై పూర్తి కాపీరైట్ అధికారం మీకు ఉందని విన్నాను. ఆ వివరాలు చెప్పండి?
జ . 1989 డిసెంబరు 2 న , తన సమస్త రచనల పై , వాటి అనువాదాలతో సహా , గ్రంథ హక్కులు నాకు పుట్టిన రోజు కానుక గా నాన్న రాసిచ్చ్చాడు . ఈ విషయం లో ఆయన మీద నేను ఎలాటి ఒత్తిడి చేయలేదు . ఆ రోజు ఈ విషయం ప్రస్తావించిన తక్షణమే , ఎంతో సంతోషంగా , ఉత్సాహంగా తన లెటర్ హెడ్ మీద స్వదస్తూరీలో రాసిచ్చ్చాడు .
2001లో తనంతట తానే ఒక చం దోబద్ధ పద్యం రాసాడు . నా మీద ఆయన ప్రేమానురాగాల్లో ఎలాంటి మార్పు కడవరకూ లేదన్నది సుస్పష్టం . నాన్న జీవితంలో చివరి దశకం లో ( 1997 -2007) కొన్ని నగ్న సత్యాలకు నేను ఏకైక సాక్షిని . ఆయన రచనలు ఒక వ్యక్తి స్వీయ ప్రచారం కోసం , దుర్వినియోగం అవుతున్నాయని గ్రహించాను . పైగా ఆయన పుస్తకాలు , ఆయన రచనలు పేరుతో నకిలీ రచనలు వెలుగులోగి రావడం జరిగింది . ఇ . ధ , వారి ఆస్థాన జాగిలాలు , కిరాయి జాగిలాలు ఈ అకృత్యానికి , హేయమైన నేరానికి పాల్పడడడం మొదలైనది . దీన్ని మొగ్గలోనే తుంచేయాలని సంకల్పించాను . ఆ మనిషి , తన కి , జా . ల తో కామోత్సవ్ నవల తిరగరాయించి నాన్న పేరుతో అచ్ఛువేయించింది . సమకాలీన సాహిత్యం లో ఇంతటి ఘోరం నేటివరకూ జరగలేదు . నాన్న ఉన్నప్పుడే ఈ నేరం జరిగింది . ఇక ఆయన కన్ను మూసినా తర్వాత ఇ . ధ , తన నేరపూరిత సొంత ప్రచారం కోసం నాన్న రచనల్ని వాడుకోవడం ప్రారంభించింది . తెలుగు విశ్వవిద్యాలయం వారికి 6 లక్షలు ఇచ్చ్చి పుస్తకాలు ప్రింట్ చేయించాలని ప్రయత్నించింది . వారికీ లీగల్ నోటీసు ఇఛ్చాను . వాళ్ళు ఆ అకృత్యాన్ని విరమించుకున్నారు . ఇ . ధ నిరంతరాయంగా ఈ నేరానికి పాల్పడడం సహజమే . నీల్ కమల్ పబ్లికేషన్స్ వారితో నాదేశం నాప్రజలు ప్రింట్ చేయించింది . దీన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ లో 2008 లో వేసిన కేసు లో 2018లో తీర్పు వచ్చింది . నాన్న నాకు రాసిచ్చిన కాపీరైట్స్ రద్దు చేసి , తనకు 2006లో తనకు బదిలీ చేసినట్లు ఇ . ధ ఒక నకిలీ పత్రం కోర్టుకు సమర్పించింది . కోర్టువారు ఈ పత్రాన్ని తెలంగాణ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కు పంపించింది . వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి , ఇ . ధ కోర్టుకు సమర్పించిన పత్రం నకిలీ ద ని , ఫోర్జరీ చేసిందని తేల్చిచెప్పింది . ఈ నివేదిక ఆధారంగానే తీర్పు చెబుతూ న్యాయమూర్తి , నాన్న రచనలు పై సర్వ హక్కులూ ఆయన కుమారుడినైన నాకు చెందుతాయని తేల్చిచెప్పారు . అసలు , ఈ తీర్పు లో ప్రధానాంశం ఏమిటంటే , నాన్న చనిపోయిన కొద్దీ రోజుల్లోనే నేను రాసిన " శేషేంద్ర శర్మ వారసులెవరు ? " వ్యాసం లో వెల్లడించిన యదార్థాలను ఈ తీర్పు ధృవీకరించింది . ఇ . ధ , ఆపాదమస్తకం నేరచరుతురాలని ఆ వ్యాసంలో నేను సాక్ష్యాధారాలతో పేర్కొన్నాను . తెలంగాణ హై కోర్టులో అప్పీలు వేసింది . జనవరి 25 , 2024 న్యాయస్థానం , ఈ అప్పీలును కొట్టేసింది . దిగువ కోర్టు తీర్పును ధృవీకరిస్తూ , ఇ . ధ , శేషేంద్ర శర్మ భార్య కాదని తేల్చిచెప్పింది . ఫలితంగా , ఇ . ధ , ఈ రోజు , నాన్న చనిపోయిన 17 సంవత్సరాల తరువాత , కొత్తగా ఆయన భార్య అని నిస్సిగ్గుగా ప్రచారం చేయిన్చుకుంటోంది . ఇ . ధ బిస్కెట్లతో పోషించే కి.జా. లు ఒకానొక పత్రికలో ఆపె పేరుతో మురికి రాతలు రాస్తున్నాయి. ఇ .ధ , ను నాన్న భార్యగా నిలబెట్టే ప్రచారం చేస్తున్నాయి . మహానుభావుడు , నార్ల వారు పత్రికా రంగంలో ఉన్నత ప్రమానాలు నెలకొల్పిన పత్రిక అది , ఈరోజు కి.జా.లకు , ఆ. జా. లకు స్థావరంగా మారింది . నకిలీ మురికి దొంగ రాతలకు నిలయంగా మారింది .
9. ఇటీవల నాన్న గారి వర్ధంతి సందర్భంగా మేము తోటపల్లి గూడూరులోని గృహం దర్శించి, అక్కడ వారి విగ్రహం ప్రతిష్టించాలని ప్రతిపాదించాం. ఈ విషయంపై మీ అభిప్రాయం?
జ. ఎంతో సంతోషకరమైన విషయం ఇది . నేను ఉబ్బితబ్బిబైపోయాను . నాన్న భౌతికంగా మన మధ్య లేక పోయినా , నిజంగా ఆత్మ అనేది ఉంటే నాన్న ఎంతో సంతోషిస్తాడు .
ఈ నేరపూరిత సమాజంలోనే , ముఖ్యంగా సాహిత్యం , పత్రికా రంగం లో కుళ్ళు హద్దు మీరిన పాడు కాలంలో , ఆయన జన్మస్థలాన్ని , ఆయన తల్లిదండ్రులను గౌరవించే వాళ్ళు ఉండడం నేటి సమాజానికి ఒక చెంపదెబ్బ . గట్టి చెప్పుదెబ్బ . మీకు నా తరఫున , ఆయన అభిమానుల తరఫున నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను .
10. శేషేంద్రగారిని గూర్చి మీరింకేమైనా ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నారా?
జ. నాన్న తెలుగు సామాజిక చరిత్రలో ఒక భయానక విషాద గాథ . 1967- 70 వరకూ మహ రాజులా బతికాడు . అరిపిరాల విశ్వం , పోతుకూచి సాంబశివ రావు వీళ్లిద్దరి వెధవ పని వల్ల
జీవితాంతం చిత్రవధ అనుభవించాడు . సభ్య నాగరిక సమాజం కన్నుగప్పి ఎవరికీ తెలీకుండా కర్ణాటక లోని హళేబీడు లో వీధి నాటకం తంతు జరిగింది .
పెళ్ళాంబిడ్డల్ని వదిలేసి మరోమనిషితో చేరాడన్న అవమానానికి , చెడ్డపేరు కు లోనయ్యాడు . తన స్వేఛ్చామయమైన సహజ జీవనానికి దూరమయ్యాడు .
వీటిని తట్టుకుని సాహిత్యం లో చేసిన కృషికి తగిన గౌరవమన్ననలు రాకపోగా , ఈర్ష్యాద్వేషాలకు గురయ్యాడు .
He is a jesus among jews .
-----------
- సాత్యకి S/o Seshendra Sharma
22 Jun 2024 - Page 3
----------
జీవిత భావోద్వేగాలే
శేషేంద్ర కవిత్వం
శేషేంద్ర కుమారులు సాత్యకి తో ప్రత్యేక ఇంటర్వ్యూ
శేషేంద్ర అంటే ఒక మహాకావ్యం. శేషేంద్ర అంటే ఒక కావ్యశాస్త్రం. కావ్యానికి కావ్యశాస్త్రానికి నిలువెత్తు సువర్ణ విగ్రహం.
నా జ్వాలిక నా దేశపు నాలిక అన్న మహాకవి శేషేంద్ర సాహిత్యపరంగానే గాక ఆయన రచనల హక్కుల విషయంలో కూడా ఈనాటికి చర్చనీయాంశంగా కొనసాగుతున్నారు. ఈ జనవరి 25న తెలంగాణ హైకోర్టు 8 ఏళ్ళ తరువాత తీర్పు చెప్తూ శేషేంద్ర రచనల హక్కులన్నీ ఆయన కుమారుడైన సాత్యకికే చెందుతాయని నిర్థారించి ప్రత్యర్థి అప్పీలును కొట్టివేసింది. ఈ నేపథ్యంలో సాత్యకితో ముఖాముఖి. నేటి సమాజంలో స్థిరచరాస్తుల కోసం పిల్లలు నేరాలకు, పాపాలకు ఒడిగడుతుంటే కన్నతండ్రి రచనలను సంరక్షించడం కోసం సమాజానికి చేరవేయడం కోసం న్యాయస్థానం ద్వారా పోరాటం చేసి గెలిచాడు. 2000 సంవత్సరంలో నవసహస్రాబ్ది ప్రారంభమైన తరుణంలోనే శేషేంద్ర సమగ్ర వెబ్‌సైట్‌ను (Visionary Poet of the Millennium : http://seshendrasharma.weebly.com/ ) రూపొందించి ఇంటర్నెట్‌లో పెట్టిన సాత్యకి ఎన్నో సత్యాలను వెలుగులోకి తెచ్చి మనముందుంచుతున్నాడు.
ప్ర: శేషేంద్ర కుమారులుగా మీ పేరు విన్నాము. మీ సాహిత్య ప్రస్థానం ఏమిటి?
జ: చిన్నప్పటి నుంచీ నాన్నకు నేను చాలా దగ్గర. నేనంటే ఆయనకు మాటల్లో చెప్పలేని ప్రేమ, గారాబం. 1972 నుంచి 2007లో నాన్న కన్నుమూసే వరకూ ఆయన నిజ జీవితాన్ని సాహిత్య ప్రస్థానాన్ని అనుక్షణం దగ్గరనుంచి గాఢంగా గమనించాను. దినవారపత్రికల్లో ప్రచురితమయ్యే నాన్న కవితలు, రచనలు ఆయన పుస్తకాలు తప్పక చదివేవాడిని. దాని ప్రభావం కాస్తంత నా మీద పడిరది. ఫలితంగానే గ్రీష్మం చెక్కిన శిల్పం, అనాత్మ కథ అనే రెండు లఘు కవితా సంకలనాలు వ్రాసి ప్రచురించగలిగాను. కానీ నాన్న నిజజీవితంలో పడిన యాతన నా ఒడిదుడుకులు కారణంగా నేను సాహిత్యంలో చెప్పుకోదగ్గ కృషి ఏమీ చేయలేదు.
ప్ర: ఎంతకాలం శేషేంద్రగారి సంరక్షణలో ఉన్నారు? కవి నాన్న రెండు పాత్రలలో శేషేంద్ర గారిని నిర్వచించండి.
జ: దాదాపు 1981 వరకూ ప్రత్యక్ష్యంగా ఆయన సంరక్షణలో ఉన్నాను. ఆ తరువాత కూడా నాన్న సహాయ సహకారాలతోటే జీవిక గడుస్తూ వచ్చింది. నాన్నగా, కవిగా నేను రెండూ వేరుగా చూడలేదు. దైనందిన జీవితంలో భావోద్వేగాలలో నుంచే కవిత్వం అగ్ని రవ్వల్లా వస్తుందని ఆయన సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ఆయన నిజజీవితంలో తరచూ నేను చూచిన అదృష్టవంతుణ్ణి.
ప్ర: నేటి యువతకు శేషేంద్ర కవిత్వం పరిచయం ఉందంటారా?
జ: ఈరోజు వర్తమాన సమాజాన్ని చూస్తే సాహిత్యమే కాదు ఇంతకుముందు తరాలు ఆధ్యయనం చేస్తూ వచ్చిన సామాజిక శాస్త్రాలకు, లలిత కళలకు ఆదరణ దాదాపు కనుమరుగైపోయిందని అనిపిస్తుంది. కానీ సాహిత్యంలో ముఖ్యంగా కవిత్వంలో ఈనాడు రచనలు చేస్తున్న యువకులు ఆయన పుస్తకాలు చదువుతున్నట్టు తెలుస్తున్నది. 2016 నుంచి ఒక సినీనటుడు రాజకీయ నాయకుడుగా మారి తెలుగు సమాజంలో తెలుగు ప్రాంతాల్లో ప్రసంగాలు చేస్తున్నారు. ప్రతి ప్రసంగంలో తప్పనిసరిగా నాన్న పేరు చెప్పి మరీ ఆయన కవితలు వినిపిస్తున్నారు. పార్టీ ఆవిర్భావ సభలో చేసిన తొలి ప్రారంభోపన్యాసం మొత్తం ఆయన కవిత్వంతో హోరెత్తించాడు. నాన్న సంపూర్ణ వచన కవితా సంకలనం ‘ధునిక మహాభారతం, షోడశి రామాయణ రహస్యములు ఇంగ్లీషు, హిందీ అనువాధాలతో సహా పుస్తకము ప్రపంచ వ్యాప్తంగా ప్రశస్తి పొందాయి. ఈ పుస్తకాల పాఠకుల సంఖ్య దినదినం పెరుగుతోంది.
ప్ర: శేషేంద్రగారు కమ్యూనిజం వైపు మొగ్గుచూపారు. నక్సలిజంను కూడా సమర్థించారు. దీనికి కుటుంబ నేపథ్యం ఉందా?
జ: నిజం చెప్పాలంటే కుటుంబ నేపథ్యం లేనేలేదు. చిన్ననాటి నుంచీ తను పుట్టి పెరిగిన పల్లెటూరు, తోటపల్లి గూడూరు నుంచే కమ్యూనిజం ప్రభావం ఆయనపై పడిరది. తన స్నేహితుల్లో చాలా మంది ఆ భావజాలానికి చెందినవారే. కమ్యూనిజం అంటే సాయుధ పోరాటంతో దోపిడీ సమాజాన్ని సమూలంగా ధ్వంసం చేసి వర్గరహిత సమసమాజాన్ని స్థాపించడం. ఈ దృష్ట్యాన్నే ఆయన నక్సలిజాన్ని సమర్థించాడు. ఎన్నికల రాజకీయాల ద్వారా ఇది సాధ్యం కాదని నాన్న విశ్వాసం, నిశ్చితాభిప్రాయం. నాన్న రాసిన రాజకీయ వ్యాసాలు ‘‘ఎంతకాలం ఈ ఎండమావులు’’? పుస్తకం చదివితే ఈ విషయం సులువుగా తెలుస్తుంది.
ప్ర: ఒక కుగ్రామం నుంచి వచ్చిన శేషేంద్రగారు విప్లవ కవిత్వ వారసత్వంగా గుర్తింపు పొందారు? దీనిని మీరు సమర్థిస్తారా? ఈ మార్పు ఎలా వచ్చిందంటారు?
జ: ఆయన అమ్మ, నాన్నలతో పెరిగిన తోటపల్లి గూడూరు (నెల్లూరు జిల్లా)లో కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు సంచరిస్తూ సభలు జరిపేవారు. కమ్యూనిస్టు పాటలు పాడి వినిపించేవారు. అప్పటినుంచే ఆ ప్రభావం ఆయనపై ఉన్నది. ఇక ఆయన రచనలు చూస్తే ఛందోబద్ధ పద్యకావ్యాలు ఋతుఘోష, పక్షులు లో ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది. రిక్షావాడు, చాకలి దళితులు ప్రముఖంగా ఆయన పద్యాల్లో గోచరిస్తారు. ఇదే ఆయన వచన కవితలైన శేషజ్యోత్స్న, మండే సూర్యుడు, నా దేశం ` నా ప్రజలు ఇతర కావ్యాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. కనుక ప్రారంభం నుంచి కడవరకూ నాన్న కావ్యయాత్రలో వర్గచైతన్య స్రవంతి నిర్విరామంగా సాగింది.
ప్ర: శేషేంద్ర కవిత్వం ఎంతకాలం జీవించి ఉంటుందని భావిస్తున్నారు?
జ: ఈ ప్రశ్నకు సమాధానం ఎవరూ చెప్పలేరు. ఈరోజు సమాజంలో సాహిత్యం ఉనికి అస్థిత్వం ప్రశ్నార్థకంగా తయారయ్యాయి. నేటి సాహిత్య రంగంగా చెప్పుకుంటున్న వర్గాల్లో సాహిత్యం కంటే కూడా స్వీయపరపతి కోసం పాకులాట కనిపిస్తుంది. వీళ్ళకు సాహిత్య ప్రమాణాలు కానీ, విలువలు కానీ అంతగా పట్టనట్టుగా లేదు. కానీ సాహిత్యం రాబోయే కాలాల్లో, తరాల్లో తన పూర్వ వైభవం పొందినట్లయితే శేషేంద్ర రచనలు వాళ్ళకు మార్గదర్శకంగా ఉంటాయని నిస్సందేహంగా చెప్పవచ్చు.
ప్ర: శేషేంద్రగారి రికార్డులకు చెంది అన్నింటిలో నామినీ ఉంటుంది కదా! ఎవరి పేరు ఉంది?
జ: నాన్న 37ఏళ్ళు మున్సిపల్ కమిషనర్‌గా ప్రభుత్వ ఉద్యోగం చేశాడు. తన రిటైర్‌మెంట్ పత్రాల్లో మా అమ్మ శ్రీమతి జానకి ని తన నామినీగా అన్ని సందర్భాల్లో నమోదు చేశాడు. 2007 నాన్న మరణానంతరం ఆ నామినేషన్ ఫలితంగానే అమ్మకు తెలంగాణ ప్రభుత్వం వారి ఫ్యామిలీ ఫెన్షన్ వస్తోంది. చట్టరీత్యా ప్రభుత్వోద్యోగి ఫెన్షన్‌కి నామినేషన్ చేసినవారే వారసులు భార్య.
ప్ర: కామోత్సవ్ నవల వివాదం ఏమిటి?
జ: కామోత్సవ్ నవల 1987లో ఆంధ్రజ్యోతిలో ప్రచురణ మొదలైనప్పటి నుంచీ నా అవగాహన ప్రకారం నాన్నను సాహత్యంలో సమాజంలో ఏకాకిని చేయడం కోసం అపఖ్యాతిని పాలు చేయడం కోసం ఇ:ధ పన్నిన విష పన్నాగం. 2006లో ఆ మనిషి మరెవరితోనో కామోత్సవ్ తిరగరాయించి మూలరచనతో ఏమాత్రం పోలికలేని నవల ఇ:ధ ప్రింట్ చేయించడం నా అనుమానాన్ని జరిగిన నేరాన్ని రుజువుచేసింది. ఇందులో అశ్లీలం పెద్ద విషయం కాకపోయినప్పటికీ, 1971 నుంచి ఫ్యాలెస్‌లో రాణితో కులుకుతున్నాడు, వేలకోట్ల ఆస్తికి అధిపతి అయ్యాడనే హద్దుమీరిన ఈర్ష్యాద్వేషాలకు గురయ్యాడు బలయ్యాడు. ఈ హేయమైన అకృత్యాన్ని బట్టబయలు చేయడానికే ఆంధ్రజ్యోతిలో వెలువడ్డ మూలరచనను ప్రచురించాను. అందులో కొన్ని ఇంటర్వూల్లో నాన్న ఇచ్చిన వివరణ కూడా ఉంది. ఈ మూల కామోత్సవ్ పుస్తకం మీద వచ్చిన సమీక్షలు అశ్లీల నిందను పూర్తిగా కొట్టిపారేశాయి. మూడు స్థాయిల్లో న్యాయస్థానాలు కేసును కొట్టివేయడం సమంజసం అని రుజువు అయ్యింది.
ప్ర: శేషేంద్రగారు కాపీరైట్స్ ఎవరికి ఇచ్చారు? కామోత్సవ్ శేషేంద్రగారి ఆత్మకథ అని భావించవచ్చా?
జ: నాన్న తన ఇష్టానుసారం నేను అడగగానే 1989లో పుట్టిన రోజు కానుకగా తన సంపూర్ణ రచనలు అనువాదాలతో సహా గ్రంథ హక్కులు నాకు రాసిచ్చాడు. సమాజంలో వివాహితగా భార్యగా గుర్తింపు పొందడం కోసం 1972 నుంచి నాన్న పేరును, నాన్న పుస్తకాలను ఇ:ధ దుర్వినియోగం చేస్తూ వచ్చింది. ఆ క్రమంలోనే నాన్న కన్నుమూసిన మరుక్షణమే ఆయన రచనలు పునర్‌ముద్రణ పన్నాగం పన్నింది. దీన్ని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో నేను సవాలు చేశాను. 2018లో ఈ కోర్టు తీర్పు చెప్తూ ప్రత్యర్థి నకిలీ పత్రం పోర్జరీ చేసి కోర్టుకు సమర్పించిందని ధుృవీకరించింది. ప్రత్యర్థి అదే సంవత్సరం హైకోర్టులో ఈ తీర్పుపై అప్పీలుకు వెళ్ళింది. జనవరి 2024 తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడిరచింది. దిగువ కోర్టు తీర్పును పూర్తిగా ఆమోదించి ధువీకరిస్తూ శేషేంద్ర గ్రంథ హక్కులు ఆయన కుమారుడనైన నాకే దక్కుతాయని తీర్పు చెప్పింది. ఈ తీర్పులోనే చట్టపరంగా ఇ:ధ నాన్న భార్య కాదని స్పష్టం చేసింది. తండ్రి సొంత కొడుక్కి ఇచ్చిన హక్కులను కన్న తల్లి వ్యతిరేకించదు కదా! ఫలితంగా ఇ:ధ వైవాహిక హోదా నాన్న రచనల దుర్వినియోగం రెంటినీ న్యాయస్థానం కొట్టివేసింది. ఇకపోతే కామోత్సవ్ వర్తమాన సమాజంలో సంపన్న వర్గాల జీవనశైలి వాళ్ల విచ్చలవిడితనం చిత్రణ అని నాన్న వివరణలో ఉంది. నా దృష్టిలో కామోత్సవ్ ఇ:ధ అంతరాత్మ కథ.
ప్ర: ఈ కేసులో సిటీసివిల్ కోర్టులో తెలంగాణ హైకోర్టులో మీ పక్షాన తీర్పు రావడానికి ప్రధాన కారణం ఏమిటంటారు?
జ: ప్రత్యర్థి తరపు న్యాయవాది హైకోర్టులో వేసిన అఫిడవిట్‌లో ప్రత్యర్థి శేషేంద్రశర్మ భార్య అని పేర్కొన్నారు. ఇక్కడే ఇ:ధ పప్పులో కాలు వేసింది. తండ్రి కొడుకుకి ధారాదత్తం చేసిన హక్కులను కన్నతలైతే ఎందుకు వ్యతిరేకిస్తుంది? న్యాయస్థానం న్యాయమూర్తుల ముందు తలెత్తిన అసలు ప్రశ్న ఇదే. సాత్యకి తల్లి ఎవరు? ఈ రెంటినీ క్షణ్ణంగా పరిశీలించి న్యాయస్థానాలు తీర్పుచెప్పాయి. కనుకనే ఇ:ధ సమర్పించిన పత్రం ఫోర్జరీదని ధృవీకరించి తీర్పుచెప్పడమే కాక చట్టరీత్యా ఇతరత్రా ప్రత్యర్థి శేషేంద్ర భార్య కాదని న్యాయస్థానం న్యాయమూర్తులు తేల్చిచెప్పారు. కనుకనే కడుపుకు అన్నం తినడం ఎరుగని గృహస్థ జీవాలతో తన పేరుతో ప్రముఖ పత్రికలో దొంగరాతలు రాయిస్తున్నది. బిస్కెట్ల కోసం అరులు చాచే ఈ జీవాలు ప్రత్యర్థిని శేషేంద్ర భార్య అనే చట్టవ్యతిరేక, సంఘ వ్యతిరేక ప్రచారం నిస్సిగ్గుగా కొనసాగిస్తున్నాయి.
ప్ర: శేషేంద్ర చనిపోయినా సొంత కుటుంబ సభ్యులు ఎవరూ వెళ్ళలేదని వినిపించిన మాట నమ్మవచ్చా?
జ: ఇది పచ్చి అబద్ధం. సంఘ వ్యతిరేక శక్తులైన ఇ:ధ పెంపుడు ప్రాణులు బహుళ ప్రచారం చేసిన అసత్యం. ఆరోజుల్లో నేను దాదాపు రోజూ వెళ్ళి చూసివచ్చేవాడిని. చనిపోయిన రోజు మా అమ్మ, అక్క వసుంధర హైదరాబాదులోనే ఉన్న మా మామలు గత్యంతరం లేక నాన్నను చూడడానికి భూత్‌బంగ్లాకు వెళ్ళవలసి వచ్చింది.
ప్ర: శేషేంద్ర దీర్ఘకాలం మంచంలో ఉన్నారటగా? మీరు వెళ్ళలేదా? తీసుకువెళ్ళాలనిపించలేదా? సంప్రదాయకంగా జరగవలసిన అంత్యక్రియలు ఎవరు నిర్వహించారు?
జ: 1997లో మొదటిసారి హార్ట్‌ఎటాక్ వచ్చినప్పటి నుంచీ అక్కడ నుంచి బయటపడమని పదేపదే చెప్పేవాడిని. అప్పటి నుంచి ఆయన ట్రీట్‌మెంట్ పథకం ప్రకారం పెడదారి పట్టించింది. కానీ బహుశా సంఘంలో గోల అవుతుందన్న జంకు మూలంగా ఇ:ధ బ్లాక్‌మెయిల్ మూలంగా నా మాట వినలేదు. 30 మే 2007 కన్నుమూసాడు. అంత్యక్రియలు నేనే చేశా. కోవిడ్ సంవత్సరం వరకూ ప్రతి సంవత్సరం వర్థంతి జయంతి సభలు పుస్తకావిష్కరణ సమావేశాలు నిర్వహించాను. ఇప్పుడు నా ఆరోగ్యం దెబ్బతిన్నది. నేను చేయలేకపోతున్నాను.
ఒకనాటి దీపాల సమూహాలన్నీ పోగా
ఏకాకిగా ఉన్న దీపకాంతిలో
మౌనస్తంభాల్ని అడుగుతాను
ఈ ఉనికి విసుగునుంచి
నన్ను రక్షించలేరా? అని.
ఎక్కడికీ కదలకుండా
అక్కడే ప్రతియేడూ పూచే గుల్మోహర్‌లని అడుగుతాను
నన్ను రక్షించలేరా? అని.
అందరూ నాకంటే గొప్పదనుకునే
అత్యున్నత భవనకుడ్యాల్ని అడుగుతాను
ఎప్పుడూ తమ గొప్పదనం చాటుకుంటూ
ఒకే చోటపడిఉన్న వెనీషియన్ ఫర్నీచర్ని అడుగుతాను
ఈ ఉనికి విసుగునుంచి రక్షించలేరా? అని.
అన్నీ దీనస్వరంతో చెబుతాయి
‘‘మేమూ నీలాగే మారని దృశ్యాలు చూస్తూ
వందేళ్ళ నుంచి పడి ఉన్నాం’’
నీకంటే పాత ఖైదీలము’’
`శేషేంద్ర, జనవంశం, పే.80)
విశాలాక్షి : సాహిత్య మాస పత్రిక :
నెల్లూరు : జులై 2024
---------
Reviews
Subject: సహస్రాబ్ది దార్శనిక కవి
కవిర్విశ్వో మహాతేజా
గుంటూరు శేషేంద్ర శర్మ
Seshendra: Visionary Poet of the Millennium
http://seshendrasharma.weebly.com/
జననం 1927 అక్టోబరు 20నాగరాజపాడు, నెల్లూరుజిల్లా
మరణం 2007 మే 30 (వయసు 79)హైదరాబాదు
తండ్రి సుబ్రహ్మణ్య శర్మ
తల్లి అమ్మాయమ్మ
భార్య / జానకి
పిల్లలు వసుంధర; రేవతి (కూతుర్లు); వనమాలి; సాత్యకి (కొడుకులు)
కవి విమర్శకుడు
ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం. అలంకారశాస్త్రాలను ఔపోసనపట్టిన పండితుడు. మంచివక్త, వ్యాసం, విమర్శ.. ఏదిరాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వమానవ దృష్టి. పానపీన ఆహారవిహారాల నుంచి నిత్య నైమిత్తిక కార్యాచరణలు, ఆలోచనలు… అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు. ‘సర్వేజనాస్సుఖినోభవంతు’ అన్నది ఆయన ఆత్మనినాదం, ఘోషం. ఆత్మీయులకూ, అభిమానులకూ ఆయన శేషేన్, శేషేంద్ర. అటూ ఇటూ బంధుత్వాలను తగిలిస్తే ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ………...... గుంటూరు శేషేంద్ర శర్మ కవిగా , విమర్శకుడిగా , దార్శనికుడిగా వింధ్య పర్వతం లాంటి వారు .
– ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక,
(21 ఆగస్టు, 2000)
* * *
పుట్టిన ఊరు నెల్లూరు జిల్లా ఉదయగిరితాలూకా నాగరాజుపాడు.
భారత ప్రభుత్వ ‘రాష్ట్రేంద్రు’ బిరుదం, కలకత్తా రాష్ట్రీయ హిందీఅకాడమీ అవార్డు,
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వ విద్యాలయం గౌరవడాక్టరేటు ముఖ్య పురస్కారాలు.
గుంటూరు ఎ.సి. కాలేజీ నుంచి పట్టభద్రులు. మద్రాసు లాకాలేజీ నుంచి ‘లా’ డిగ్రీ.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోమున్సిపల్ కమీషనరుగా పనిచేసి, పదవీ విరమణ వేశారు.
నాదేశం – నాప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణహంస, కాల రేఖ, షోడశి, ఆధునిక మహాభారతం, జనవంశమ్ ప్రధాన రచనలు.
కవిత్వంలో, సాహిత్యవిమర్శలో విలక్షుణులు.
ప్రపంచ సాహిత్యం మీద, భారతీయ సాహిత్యం మీద సాధికారిక పరిచయం.
సంస్కృత, ఆంధ్ర, ఆంగ్లభాషల్లో పండితులు,
వచన కవిత్వం, పద్య రచన – రెండిరటి సమాన ప్రతిభావంతులు,
ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ఈయన ప్రత్యేకత.
వచన కవిత్వానికి ఒక కొత్త వాకిలి తెరిచిన స్వతంత్రులు.
బహిరంతర ప్రకృతులకు తమ రచనల ద్వారా వ్యాఖ్యానం పలికిన దార్శనిక కవి.
ఒకానొకశైలీనిర్మాత.
– యువ నుంచి యువ దాకా (కవితా సంకలనం)
అ.జో. – వి. భొ. ప్రచురణలు 1999
-----------
అధునిక వాగనుశాసనుడు శేషేంద్ర
“గుంటూరు శేషేంద్ర శర్మ నా దేశం నా ప్రజలు (1975) ఆధునిక ఇతిహాసంగా చెప్పబడింది. అభివ్యక్తిలో, ఆలంకారికతలో, వస్తు విన్యాసంలో కవి తనదైన వ్యక్తిత్వాన్ని ముద్రించుకున్నాడు. విప్ణవభాషా విధాతగా పేరుగన్నాడు. ఈయన కవిసేన మేనిఫెస్టో (1977) పేరుతో ఆధునిక కావ్యశా!స్తాన్ని కూడా రచించి నేటి యువతరాన్ని ఆకర్షిస్తున్నాడు. పద్యాల్గో వచన కవితా ప్రక్రియలో కావ్యాలనేకంగా రచిస్తూ సమకాలిక కవితారంగంలో శిఖరాయమానంగా వెలుగుతున్నాడు. కొంగ్రొత్త (ప్రయోగాలతో కావ్యభాషా స్వరూపంలో మార్చుతెస్తున్న ఆధునిక వాగనుశాసనుడు శేషేంద్ర.”
ఆచార్య పేర్వారం జగన్నాథం
సంపాదకుడు
అభ్యుదయ కవిత్వ్యానంతర ధోరణులు,
(ప్రచురణ 1987)
మాజీ వైస్ ఛాన్సలర్,
తెలుగు యూనివర్సిటీ)
Visionary Poet of the Millennium
seshendrasharma.weebly.com








